BRS: అసెంబ్లీకి ఆటోలో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు...! 4 d ago
ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఆటో నడుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ.. ఖాకీ చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ, సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ సభలోకి వచ్చారు.